జోడి లింగాల సంగమేశ్వర స్వామి ఘనంగా రథోత్సవం,,

భారత్ న్యూస్:
జోడి లింగాల సంగమేశ్వర స్వామి ఘనంగా రథోత్సవం…

సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తజనం…

జిల్లా నలమూలల నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తాదులు..

భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు..

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన సిఐ శివరాముడు

కూడేరు, ఏప్రిల్ 23( భారత్ న్యూస్) స్థానిక మండల కేంద్రంలోని పుట్ట రూపంతో వెలిసిన శ్రీ జోడలింగాల సంగమేశ్వర స్వామి మడకతేరు, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది,
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 10:30 గంటలకు ఉపవాసం దీక్షతో మడకతేరు రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయన్న ప్రగాఢ విశ్వాసంతో భక్తులు కూడేరుకు తండోపతంలాలుగా రాష్ట్రం నుండి కాక ఉమ్మడి జిల్లా నుండి ఇతర రాష్ట్రాలు అయినా కర్ణాటక, తెలంగాణరాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మండలంలోని అన్ని గ్రామాలతో పాటుభక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం ఓం నమశ్శివాయ అంటూ భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఆలయ కమిటీ అధికారి సాకే రమేష్ బాబు, కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ రాముడు, వారి సిబ్బందితోపాటు,ఆలయ కమిటీ చైర్మన్ రామదుర్గం కిష్టప్ప, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీసులు సహకారముతో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తాదులకు తోపులాటకు ఆస్కారం లేకుండా మడుగుతేరు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలు, సుగంధ పుష్పాలతో అభిషేకం గావించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఆలయ ఈవో రమేష్ బాబు, ఆలయ సిబ్బంది సాయి, ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సౌకర్యం, స్వామివారి దర్శమునకు ప్రత్యేక ఏర్పాట్లు, అన్నదాన కార్యక్రమాలు, భక్తాదుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకుడు మహేష్ స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు..