ఎఫ్ ఆర్టీఐ కార్యకర్తలు నీతి గా ఉండాలి*నిజాయితీగా ఉండాలి…..

ఎఫ్ ఆర్టీఐ కార్యకర్తలు నీతి గా ఉండాలి*నిజాయితీగా ఉండాలి…..
— దందాలు, సెటిల్ మెంట్లు చేస్తే తొలగిస్తాం
— అవినీతికి పాల్పడితే ప్రభుత్వం శిక్షిస్తుంది
(భారత్ న్యూస్ ;;;;అమరావతి)
-++అమరావతి, ఏప్రిల్ 28: సమాచార హక్కు చట్టం, హ్యుమన్ రైట్స్,లోకాయుక్త మరియు వినియోగ దారుల సమస్యలపై అవగాహన కల్పిస్తున్న ఫోరమ్ ఫర్ ఆర్టీఐ లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ నీతి , నిజాయితీ కలిగి న్యాయ బద్దంగా వ్యవహరించాలని సంస్థ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ పిలుపు నిచ్చారు. ఆదివారం అమరావతి కేంద్ర కార్యాలయం లో విడుదల చేసిన ఒక ప్రకటనలో అవినీతి పరులను సంస్థలో తావు లేదని పేర్కొన్నారు. దందాలు,సెటిల్ మెంట్లు నిర్వహించటం నేరమని, FRTI లో ఎవరైనా అవినీతి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీఐ,హ్యూమన్ రైట్స్ పేరుతో కార్డులు చూపించి money వసూళ్లకు పాల్పడే వారిని ప్రభుత్వానికి అప్పగించి శిక్షపడేలా చర్యలు ఉంటాయని, చెప్పారు.
స్వచ్ఛందంగా కొంత సమయం లో సమాజ సేవ చేయాలని భావించే వారు ముందుకు వచ్చిFRTI లో పనిచేయాలని అందుకు గాను గుర్తింపు కార్డులు(ఐడీ కార్డులు) ఇస్తున్నట్లు తెలిపారు.