మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్మారక స్థూపం ఏర్పాటుకు కృషి చేస్తా.

భారత్ న్యూస్ కోడూరు

ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తా..!

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య స్మారక స్థూపం ఏర్పాటుకు కృషి చేస్తా.

ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ ఆలయంలో చోరీ జరిగితే నేటికి దొంగలను పట్టుకోలేదు..?

కృష్ణ పుష్కర సమయంలో మీరు అందించిన సహకారం మరువలేనిది..

నాలుగు సంవత్సరాలగా 5000 ఎకరాల సాగు భూమి బీడుభూమిగా మారిన పట్టించుకున్న పరిస్థితి లేదు.

తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి కొరకే ఉల్లిపాలెం భవానిపురం వారధి ఏర్పాటు..మండలి.

దివిసీమ అభివృద్ధి కావాలంటే మీరే రావాలి.. మంత్రి కావాలి ఆర్యవైశ్యులు

కోడూరు: ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి
రోశయ్య స్మారక స్థూపం ఏర్పాటుకు కృషి చేస్తానని, అవనిగడ్డలో ఆయన విగ్రహం పెట్టేందుకు ఏర్పాటు చేస్తానని ఆవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్థి డా మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

బుధవారం కోడూరు శ్రీ ధానా శక్తి ఆర్యవైశ్య ప్రార్ధన మందిరం నందు ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బుద్దప్రసాద్ మాట్లాడుతూ,మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు స్పూర్తితో సేవానిరతితో ఆర్యవైశ్యులు సంఘాలను నడిపిస్తున్నారని అభినందించారు. ఆర్యవైశ్యులు సానుకూల ధృక్పథంతో వ్యవహరిస్తూ కృష్ణ పుష్కర సమయంలో ఎన్నో సేవలు అందించి మాకు సహకారం అందించారని కొనియాడారు.

సమాజంలో శాంతి భద్రతలు కరువైయ్యాలని అవనిగడ్డలో డాక్టర్ శ్రీహరి హత్య జరిగిన, ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయంలో చోరీ జరిగిన నేటికీ ముద్దాయి లను పట్టుకోలేదంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని బుద్ధప్రసాద్ సూచించారు.

కోడూరు మండలంలో ఐదు వేల ఎకరాలలో నాలుగు సంవత్సరాలుగా పంట వేసుకునే పరిస్థితి లేక బీడు మారితే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదని తెలిపారు.

ఉల్లిపాలెం భవానిపురం వారధి నిర్మాణం చేపట్టింది తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి కొరకు కోడూరు మండలంలో వర్తక వాణిజ్య వ్యాపారాల అభివృద్ధి కోసమేనని అన్నారు

మనిషి మనిషిగా బతికే పరిస్థితులు రాష్ట్రంలో రావాలనీ, కూటమి ప్రభుత్వంతోనే అది సాధ్యమని మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి ని అవనిగడ్డ ఎమ్మెల్యే గా నన్ను రెండు ఓట్లు గ్లాసు గుర్తుపై వేసి గెలిపిస్తే. నియోజకవర్గ అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని బుద్ద ప్రసాద్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్యులు మాట్లాడుతూ.. దివిసీమ అభివృద్ధి కావాలంటే మీరే రావాలని మంత్రి కావాలని మాసహకారం మీకు ఎప్పుడూ ఉంటుందని బుద్ధ ప్రసాద్ కు భరోసా ఇచ్చారు.