ఓ గృహిణి పట్ల కుటుంబ సభ్యుల అమానుష చిత్రహింసలు

ఓ గృహిణి పట్ల కుటుంబ సభ్యుల అమానుష చిత్రహింసలు……(భారత్ న్యూస్ ;;;;గుంతకల్)
~ఓవైపు తాళిని తెంచిన అత్త .. మరోవైపు జుట్టు కత్తిరింపు ఇనుప కడ్డీతో వాతలు… ఇంకోవైపు కారం చల్లుతూ వికృతి చేష్టలతో మరిది ,చితకబాదిన భర్త

గుంటకల్ పట్టణం అంబేద్కర్ నగర్ ప్రాంతం నివాసముంటున్న గౌరమ్మ కుమార్తె కృష్ణవేణి అనే గృహిణి పట్ల బళ్లారి కి చెందిన భర్త రాజ ,, అత్త శకుంతల,, భర్త పెద్దమ్మ వెంకటమ్మ,, మరిది సులోన్ లు తన పట్ల అమానుషంగా చిత్రహింసలు గురిచేసి హత్యాయత్నం కు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. బుధవారం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతూ విలేకరులకు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దల అంగీకారంతో 2013 ఏడాది మే మాసంలో బళ్లారికి చెందిన రాజా తో వివాహం జరిగింది సదరు వివాహ అనంతరం నలుగురు సంతానం కలిగిందన్నారు. కాగా తన భర్త రాజా మద్యం కు బానిసై గత ఆరోమాసా ల క్రితం తరచూ గొడవలకు దిగుతుండడం అందుకు తన అత్త శకుంతల వేధిస్తూ తనను పుట్టింటికి గెంటి వేయడం జరిగిందన్నారు గత 20 రోజుల క్రితం తనను కాపురానికి రావాలని కుటుంబ పెద్దమనుషుల పంచాయతీతో తన అత్త బళ్లారికి పిలిపించారన్నారు ఈ క్రమంలోనే తన భర్త తన పట్ల అవమానంగా ప్రవర్తిస్తూ అనుమానం వ్యక్తం చేస్తూ చిత్రహింసలకు గురి చేసేవాడు తన భర్త ప్రవర్తనను అనుకరిస్తూ తన అత్త తో పాటు మరిది సులోన్ ఓవైపు భర్త పెద్దమ్మ వెంకటమ్మ మరోవైపు దాడికి పాల్పడ్డారు వారి దాడిలో భాగంగా భర్త చేతకబాదుతుండడం మరిది తన చేతులను కట్టేసి తన జడను కత్తిరించి ఇనుప కడ్డీతో వాతలుగా కాల్చడం ఆపై ఒంటి పై కారం చెల్లుతూ చిత్రహింసలకు గురి చేశారన్నారు వారి చేష్టలకు తాను వేస్తున్న కేకల పై చుట్టుపక్కల వారితో గాలి చేష్టలుగా అభివర్ణిస్తూ ప్రచారం చేయసాగారు ఈ క్రమంలో తన పుట్టింటి తల్లికి ఫోను ద్వారా మీ కుమార్తెకు గాలి చేష్టలు (దయ్యం పట్టింది అంటూ) వచ్చి పిలుచుకొని పోవాలంటే వారించారు. దీంతో తన తల్లి చేసేదేమీ లేక తనను తనతో పాటు తన సంతానాన్ని తోడు కునే వస్తుండగా ఇద్దరు పిల్లలను మాత్రమే మా వెంట పంపించారు ఇంటికి చేరుకున్న తనను తన తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని అంతా తన తల్లితో చెప్పడంతో తనకు కలిగిన గాయాల పట్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం రావడం జరిగిందన్నారు సదరు గాయాల పట్ల ఆస్పత్రి వైద్య బృందం ఆరా తీశారని ఈ విషయమే నా వాంగ్మూలం మేరకు పోలీసులకు సమాచారం అందించారు. నాకు నా భర్త, అత్త ,,మరిది,, తదితరుల పట్ల ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించి చట్టపరంగా న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.