గ్రామీణుల కళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ…

భారత్ న్యూస్ రాజమండ్రి….గ్రామీణుల కళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ…
120మందికి ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమంలో
ఆమెన్ ట్రస్ట్ ను అభినందించిన వైద్య ఉద్యోగుల నేత జీ.వీ.వీ.ప్రసాద్

తూర్పు గోదావరి:: దేవరపల్లి:
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కళ్లను కంటికి రెప్పలా కాపాడేందుకు పల్లె పల్లెనా విస్తృతంగా ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆమెన్ ట్రస్ట్ సేవకు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జీ.వీ.వీ.ప్రసాద్ కొనియాడారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు షాలోమ్ టెంపుల్ ఆవరణలో ఆమెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, పోషకాహార లేమితో కంటి సంబందిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుందని, వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని కంటిని పరిరక్షించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమ ప్రధాత, ఆమెన్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇవాంజలిన్ అశోక్ మాట్లాడుతూ, వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి వారి సహాకారంతో గతవారం నిర్వహించిన ఈ ఉచిత కంటి పరీక్షల కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, దాదాపు ఐదు వందల మంది క్యాంపు కు రాగా అందులో 20 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. అందులో కళ్ళజోళ్ళు అవసరమైన 120 మందికి సైతం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కళ్ళజోళ్లను అందజేయడం జరిగిందని చెప్పారు. కాగా, మలేరియా నివారణ మాసోత్సవాలను పురస్కరించుకొని దుద్దుకూరు తో పాటు పలు ప్రాంతాల్లో త్వరలోనే దోమతెరలను పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. దుద్దుకూరు సోసైటీ మాజీ అధ్యక్షులు కాండ్రు రామకృష్ణ తమ ప్రసంగంలో ఆమెన్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం అన్న మాటను నిజం చేస్తున్నా ఆమెన్ ట్రస్ట్ సేవలను పంచాయతీ కార్యనిర్వాహణ అధికారి బీ.ఎస్.రామచంద్రరావు అభినందించారు. కార్యక్రమాన్ని షాలోమ్ టెంపుల్ నిర్వాహకులు కొడవటి బుజ్జిబాబు నడిపించారు….