భారత్ న్యూస్ గుంటూరు….అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఈ రోజు మహానాడు లొ చేశారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు రైతులకు అందిస్తామని ప్రకటించారు.
ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
