భారత్ న్యూస్ గుంటూరు…..తూ గో జిల్లా…..
నల్లజర్ల మండలం
మహిళలకు పునర్జన్మ నిచ్చిన ఎమ్మెల్యే
గల్ఫ్ బాధితురాలు (చిలకా నిర్మల ) 16 నెలలు అష్ట కష్టాలు పడి చావే శరణ్యం అనుకున్న దశలో ఎమ్మెల్యే చోరవతో పునర్జన్మ కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు….
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన మహిళ నకిలీ ఏజెంట్ మాటలు విని మోసపోయి కువైట్లో నిర్బంధించబడి అష్ట కష్టాలు పడిన వైనం….
కొన్ని రోజులు తినడానికి తిండి లేక గదిలో నిర్బంధించబడి ఉన్న మహిళ (చిలకా నిర్మల) తన గ్రామానికి చెందిన ఏఎంసీ చైర్మన్ యుద్దన్నపూడి బ్రహ్మ రాజు సహకారంతో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లగా…..
స్పందించిన ఎమ్మెల్యే మద్దిపాటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి దుబాయ్ దేశంలో చిక్కుకున్న మహిళను సురక్షితంగా తన గ్రామానికి చేర్చారు….
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పిల్లలకు దూరం అయిపోతాను అనుకున్న తరుణంలో తనను కాపాడిన లోకేష్ అన్నకు వెంకటరాజు అన్నకు రుణపడి ఉంటానని వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జీవితాంతకాలం రుణపడి ఉంటాను తెలియజేశారు…..
