రోడ్డు ప్రమాదానికి గురైన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బొప్పనను పరామర్శించిన టిడిపి నేత కనపర్తి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….రోడ్డు ప్రమాదానికి గురైన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బొప్పనను పరామర్శించిన టిడిపి నేత కనపర్తి

అవనిగడ్డ, మే 17: ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అవనిగడ్డ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ) బొప్పన సుబ్రమణ్యేశ్వరరావును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పరామర్శించారు.ఆదివారం అవనిగడ్డలోని సుబ్రమణ్యేశ్వరరావు నివాసానికి వెళ్లిన కనపర్తి శ్రీనివాసరావు ఆయనను కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆయనతో పాటు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,రాజశేఖర స్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు,అశ్వరావుపాలెం నీటి సంఘాల అధ్యక్షుడు దాసినేని శ్రీనివాసరావు,పాత ఎడ్లంక టీడీపీ అధ్యక్షులు కొల్లూరి వాసు తదితరులు పాల్గొన్నారు