జగన్‌ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…జగన్‌ Vs సాయిరెడ్డి..తారకరత్న భార్య సంచలన పోస్ట్!

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తన బాబాయి విజయసాయిరెడ్డికి మద్దతుగా చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు. కానీ నిజం లోపల నిశ్శబ్దంగా, బలంగా ఉంటుంది. కొన్ని తప్పుడు కథనాలు ఉన్నప్పటికీ, అది అర్హులు కాని వారి పట్ల గౌరవం. నమ్మకం, విధేయత, నీతి అనేవి బోధించినవి మాత్రమే కాదని ఇప్పటికీ జీవించబడ్డాయి. చాలా మంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, వాటిని తాను చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నాను. మీరు కూడా మాట్లాడాలని ఎంచుకుంటే ఏమి జరుగుతుంది? మేం కూడా మాట్లాడటం మొదలు పెడితే ఏం జరుగుతుందని.. ఇది నిజం’ అంటూ అలేఖ్య ఫేస్‌బుక్ వేదికగా రాసుకొచ్చారు. అంతేకాదు, బాబాయి విజయసాయిరెడ్డితో కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా ఆమె జత చేశారు.

అలేఖ్య చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్, సాయిరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అలేఖ్య సాయిరెడ్డికి మద్దతుగా నిలవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే, సాయిరెడ్డికి పార్టీలోనూ, బయట కూడా మద్దతు పెరుగుతోందని అర్థమవుతోంది. రానున్న రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.