భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీలో QR కోడ్తో కొత్త రేషన్ కార్డులు.. ప్రయోజనాలు
ఇవే!
అమరావతి :

ఏపీలో QR కోడ్ ఆధారంగా ప్రభుత్వం అందించే కొత్త రేషన్ కార్డులతో పౌరులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల నాణ్యమైన, తక్కువ ధర సరఫరా, బియ్యం, నూనె, పప్పులు వంటి వస్తువులను తక్కువ ధరకు పొందే అవకాశం ఉంటుంది. ప్రామాణిక గుర్తింపు పత్రంగా ఇతర పథకాల కోసం గుర్తింపుగా పనిచేస్తుంది. సైబర్ మోసాలను నివారించగలదు. ఎక్కడైనా రేషన్ పొందే సౌకర్యం ఈ కార్డు ద్వారా కలగనుంది. క్యూఆర్ కోడ్ ఆధారంగా వివరాలను త్వరగా వెరిఫై చేసుకోవచ్చు.