ఆర్ఆర్ఆర్‌లో భూమి పోతుందనే బాధలో గుండెపోటుతో రైతు మృతి

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్ఆర్ఆర్‌లో భూమి పోతుందనే బాధలో గుండెపోటుతో రైతు మృతి

తొలిసారి నోటీసులు ఇచ్చినప్పుడు తల్లిని, మరోసారి నోటీసులు ఇచ్చినప్పుడు తండ్రిని కోల్పోయిన పిల్లలు

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామానికి చెందిన ఎంబరి భిక్షపతి అనే రైతుకు ట్రిపుల్ ఆర్ లో భూమి పోతుందని నోటీసులు ఇచ్చిన ఆర్డీఓ కార్యాలయ అధికారాలు

దీంతో సుమారు రూ.2 కోట్లు విలువ చేసే భూమికి కేవలం రూ.6 లక్షల పరిహారం చెల్లిస్తున్నారనే ఆవేదనతో గుండెపోటుతో మృతి చెందిన భిక్షపతి

భూసేకరణకు సంబంధించి తొలిసారి నోటీసులు ఇచ్చినప్పుడు తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోయి వారి ఇద్దరు పిల్లలు నిత్య (9), దీపిక (11) అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

భూమి విలువకు సమీపదూరంలో కూడా పరిహారం ఇవ్వట్లేదని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్న గ్రామస్తులు