భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి : మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్.

ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీ నెరవేరుస్తాం.. ఉచిత బస్సుతో సూపర్-6 హామీలు పూర్తయినట్లే.

ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్ధం చేశాం.. పాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు.

తాను ఎప్పుడూ చేసే అరాచకాలు ఈసారి జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నాడు.. జగన్ నైజం ఏంటో ప్రజలకు తెలిసిందే.

వైఎస్ఆర్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు.

నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితుల నుంచి 11 మంది నామినేషన్ వేయగలిగారు.

2 పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్ ఎప్పుడైనా జరిగిందా?.. శాంతిభద్రతల నిర్వహణ పటిష్టంగా ఉన్నందునే ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారు : సీఎం చంద్రబాబు