భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలోని పాఠశాలల్లో ఏఐ హాజరు విధానం
అమరావతి :
ఏపీ విద్యాశాఖ పాఠశాలల్లో హాజరు నమోదుకు సరికొత్త ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానం త్వరలో రాష్ట్రవ్యాప్తం కానుంది. విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, గ్రూప్ ఫొటో తీయగానే ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, హాజరు నమోదులో ఖచ్చితత్వం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
