అణుశక్తితో నడిచే ‘హైడ్రోజన్‌ ప్లాంట్‌’

భారత్ న్యూస్ అనంతపురం..అణుశక్తితో నడిచే ‘హైడ్రోజన్‌ ప్లాంట్‌’

🔹 ప్రపంచంలోనే కల్పక్కంలో మొట్టమొదటి కేంద్రం

🔹తమిళనాడులోని కల్పక్కంలో ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌(ఐజీసీఏఆర్‌) సెంటర్‌లో అణుశక్తిని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి కర్మాగారాన్ని భారత్‌ ప్రారంభించింది. విద్యుత్తును ఉపయోగించకుండా, ఫాస్ట్‌ బ్రీడర్‌ టెస్ట్‌ రియాక్టర్‌ నుండి ఉత్పత్తయ్యే అణు ఉష్ణాన్ని ఈ ప్లాంట్‌ నేరుగా వాడుకుంటుంది. దీంట్లో కాపర్‌-క్లోరిన్‌ థర్మోకెమికల్‌ సైకిల్‌ ద్వారా నీటిని విచ్ఛిన్నం చేసి హైడ్రోజన్‌ను తయారుచేస్తారు.

🔹డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ(డీఏఈ), ఐజీసీఏఆర్‌, బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) సైంటిస్టులు సంయుక్తంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. గత శుక్రవారం ఈ ప్లాంట్‌ను అణుశక్తి కమిషన్‌ చైర్మన్‌ అజిత్‌కుమార్‌ మహంతి ప్రారంభించారు. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించి, దేశ ఇంధన భద్రతను పెంపొందించటం దీని ముఖ్య ఉద్దేశం.