భారత్ న్యూస్ హైదరాబాద్ …దేశంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: TRS చీఫ్ కవిత
తెలంగాణ :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా రాష్ట్రాల మధ్య డూప్లికేట్ ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న లక్షలాది మందికి ఏపీలోనూ ఓట్లు ఉన్నాయని, దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడాలని ఆమె కోరారు.

బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు తొలగించారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఈ డూప్లికేట్ ఓట్లతోనే సీఎం రేవంత్ గెలిచారని కవిత ఆరోపించారు