ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) గుండెపోటు కారణంగా చెన్నైలో కన్నుమూశారు.

భారత్ న్యూస్ విజయవాడ…ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) గుండెపోటు కారణంగా చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆకస్మిక గుండెపోటుతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ‘స్క్రీన్ ప్లే ల్యాబ్’గా గుర్తింపు పొందిన భాగ్యరాజ్, 75కు పైగా సినిమాల్లో నటించి, 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ముందానై ముడిచ్చు’, ‘ఆంథ 7 నాట్కల్’ వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు