దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్‌ యూజర్స్.. ట్రాయ్‌ తాజా నివేదికలో వెల్లడి

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్‌ యూజర్స్.. ట్రాయ్‌ తాజా నివేదికలో వెల్లడి

2026 మార్చి నాటికి దేశంలో మొత్తం ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 109.27 కోట్లకు చేరింది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 102.86 కోట్లుగా ఉండగా.. కేవలం మూడు నెలల్లోనే 6.24 శాతం వృద్ధి నమోదైంది.

ట్రాయ్ నివేదిక ప్రకారం.. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులలో 104.62 కోట్ల మంది వైర్‌లెస్ ద్వారా, 4.65 కోట్ల మంది వైర్డ్ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. వీరిలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 106.58 కోట్లుగా ఉండగా.. న్యారోబ్యాండ్ (56 కేబీపీఎస్ కంటే తక్కువ వేగం) సబ్‌స్క్రైబర్లు 2.69 కోట్లుగా ఉన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల బేస్ 5.81 శాతం పెరగడం విశేషం. ఇంటర్నెట్‌తోపాటు మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా 133.05 కోట్లకు పెరిగింది.