భారత్ న్యూస్ గుంటూరు…సి.ఆర్. కాలనీ పార్కులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని సి.ఆర్. కాలనీ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, పురప్రముఖులుపాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హాజరైన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆకాంక్షించారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. హాస్పిటళ్లకు వెళ్లాల్సిన పని లేదు
ప్రత్తిపాటి పుల్లారావు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నిత్యం యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. యోగా అనేదిసర్వరోగ నివారిణి లాంటిదని, క్రమం తప్పకుండా యోగా చేసే వారికి ఎలాంటి మందులు, హాస్పిటళ్లతో పని లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు, పీఎం మోదీల ఆరోగ్య రహస్యం యోగానే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమకు, వారి ఆరోగ్యానికి యోగా మరియు ధ్యానమే ముఖ్య కారణమని ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారు అలసట లేకుండా, ఎంతో ప్రశాంతమైన ఆలోచనలతో, దూరదృష్టితో ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలుతీసుకోగలుగుతున్నారంటే అది యోగా ద్వారా లభించిన మానసిక శక్తేనని కొనియాడారు.
రాష్ట్రంలోని 5 కోట్ల మంది భాగస్వాములు కావాలి
రాష్ట్రంలో ఉన్నఐదు కోట్ల మంది ప్రజలను యోగా వైపు నడిపించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని, అందుకే కూటమి ప్రభుత్వం యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రజలందరూ యోగాను అలవర్చుకుని ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.