భారత్ న్యూస్ వరంగల్…పోక్సో కేసులో కేంద్ర మంత్రి తనయుడు బండి భగీరథ్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మల్కాజిగిరి కోర్టు..
సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున పరీక్షలకు హాజరయ్యేందుకు అతనికి తాత్కాలిక బెయిల్ ఈ నెల 26 వరకు మంజూరు చేసినట్లు తెలిసింది..
రెండు వారల క్రితం పోక్సో కేసులో భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.. కేసు నమోదు తర్వాత అరెస్ట్ భయంతో పరారైన భగీరథ..ముందస్తు బెయిల్.. లేదా అరెస్ట్ తరువాత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ తన న్యాయవాదుల ద్వారా హై కోర్టు ను ఆశ్రయించాడు.. అయితే ఈ పిటిషన్ ను విచారించిన హై కోర్టు వెకేషన్ కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది..
దీంతో భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు..! అయితే తామే పోలీసులకు అప్పగించమని భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి మీడియాకు తెలిపారు..

మొత్తం మీద ఇపుడు అతనికి ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు జూన్ 26 వరకు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది..