భారత్ న్యూస్ అనంతపురం..ఏపీలో త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు???
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని.. త్వరలో వాటిని నిర్వహిస్తానని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి నివేదించింది.
సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, దానికి సంబంధించిన డేటాను ఈనెల 19 నుంచి రెండ్రోజుల పాటు గ్రామసభల ముందు ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు.

ఆ తరువాత ఈనెల 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.