మంత్రం” అనే పదం సంస్కృతంలోంచి ఉద్భవించింది. “మన్” అనగా ‘చింతన చేయడం’, “త్ర” అనగా ఉపకరణాలు, అందుచేత ‘చింతన సాధనం’ అని శాబ్ధిక అనువాదం చేస్తారు.

భారత్ న్యూస్ తిరుపతి…..🙏🔥🌹💐!!.అయ్యప్ప పూజ.!!💐🌹🔥🙏
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

“మంత్రం” అనే పదం సంస్కృతంలోంచి ఉద్భవించింది. “మన్” అనగా ‘చింతన చేయడం’, “త్ర” అనగా ఉపకరణాలు, అందుచేత ‘చింతన సాధనం’ అని శాబ్ధిక అనువాదం చేస్తారు.

అన్ని మంత్రాలకు ఆధారమైన “ప్రణవ మంత్రం” గా పిలవబడే “ఓం” మంత్రాలన్నిటిలో ముఖ్య మంత్రం. చాలామటుకు మంత్రాలను రెండు పంక్తులలో రాసే లేఖన శైలి అయిన “శ్లోకాల”లో రాస్తారు.

మంత్రాలు అతి శక్తివంతమైన శబ్ధాలు. ఇవి పఠించిన వారికి గొప్ప సానుకూల ప్రభావాలు కలుగును. ఆ మంత్రాలను పదే పదే పఠించడాన్ని “జపం” అని అంటారు. ప్రతీ మంత్రంలో గొప్ప అర్థం ఉంటుంది. అత్యంత భక్తితో ఈ మంత్రాలను పఠించినచో గొప్ప విముక్తి మార్గం లభించును – అది “శాశ్వతమైన ఆనందం”.

ఈ శ్లోకాలు మానవులు సృష్ఠించినవికావు. మహాఋషులచే భగవంతుడు చెప్పించినవి. ప్రతి పదంలో ఒక శక్తి ఉంది.

మంత్రజపం ద్వారా త్వరగా మనశ్శాంతిని పొందవచ్చును – “ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప”.

గణపతి ప్రార్థన

“శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం
అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే”
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.!!

అయ్యప్ప ప్రార్థన
🌼🌼🌼🌼🌼🌼
“అఖిల భువనదీపం – భక్తచిత్తాబ్ద సూనం
సురగర మునీ సేవ్యం – తత్వమస్యాది లక్ష్యం
హరి హర సుతమీషం – తారక బ్రహ్మ రూపం
శబరిగిరి నివాసం – భావయే భూతనాథం!!!”

శ్రీ గురుభ్యోనమః
గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరంబ్రహ్మః తస్మైశ్రీ గురువే నమః
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః
స్వామియే శరణం అయ్యప్ప!!!

అయ్యప్ప శ్లోకం
🌷🌷🌷🌷🌷

  1. నమస్తే సర్వశక్తాయ నిత్యాయ పరమాత్మనే!
    పురుషాయాది బీజాయ | పరేశాయ నమోనమః!!
  2. తస్మై నమోభగవతే| నిర్వాణ సుఖదాయినే
    సర్వపాప హారయ పాపాయనంద మూర్తయే!!
  3. భూరికారుణ్య యుక్తాయ నిత్యాయ పరమాత్మనే|
    క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వధారాయ సాక్షిణే !!
  4. ఆనంద రూపిణిం శాంతం ఘోర సంసారతారకం |
    సృష్టి స్థిత్యస్త రూపాంతం శాస్తారం ప్రణతోస్మ్యహం !!
  5. నమఃపరాయ గోప్ర్తేస్తు తారక బ్రహ్మరూపిణే
    ఆర్యనాదాయ దేవాయ భూతనాధాయతే నమః
    ధ్యాయేత్ చారుజడాని బద్దమకుటం
    దివ్యాంబరం జ్ఞానము
    ద్రోద్యక్షకరం ప్రసన్న వదనం జానుస్థ హస్తేతరం
    మేఘశ్యామల కోమలం సురనుతం
    శ్రీయోగ పట్టాకచితం
    విజ్ఞాన ప్రధమ ప్రమేయ సుఘమం
    శ్రీ భూతనాధం విభుం !!

శరణమయ్యప్పా – స్వవేదప్రియనే శరణమయ్యప్ప !
వీర మణికంఠనే శరణమయ్యప్ప !!
శరణు ఘోష ప్రియనే శరణమయ్యప్ప !!!