బాల్క సుమన్‌పై అబిడ్స్ పోలీసులకు ఖైరతాబాద్ డీసీసీ ఫిర్యాదు

భారత్ న్యూస్ హైదరాబాద్…బాల్క సుమన్‌పై అబిడ్స్ పోలీసులకు ఖైరతాబాద్ డీసీసీ ఫిర్యాదు

మంగళవారం హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోత రోహిత్, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టాలని, రైల్వే లైన్లను దిగ్బంధించాలని సుమన్ రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు.

సమాజంలో అరాచకం సృష్టించేలా వ్యాఖ్యానించిన ఆయనపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…