భారత్ న్యూస్ గుంటూరు.మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండగ సెలవు దినాన్ని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన ఈ బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
