గనుల శాఖ డైరెక్టర్‌కు రూ.25,000 జరిమానా.ap

భారత్ న్యూస్ గుంటూరు…గుంటూరు జిల్లా
మంగళగిరి..

సంచలన నిర్ణయం…..

గనుల శాఖ డైరెక్టర్‌కు రూ.25,000 జరిమానా

సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన అధికారిపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కఠిన చర్య

సమాచార హక్కు చట్టం, 2005 అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిన గనులు & భూగర్భశాఖ డైరెక్టర్‌పై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది.

రాష్ట్ర సమాచార కమిషనర్ Chavali Suneel Andhra Pradesh State Information Commissioner”ఫిర్యాదు నం.100/2023లో విచారణ జరిపి, అప్పటి ప్రజా సమాచార అధికారి మరియు ప్రస్తుతం డైరెక్టర్ & ఫస్ట్ అప్పిలేట్ అథారిటీగా కొనసాగుతున్న శ్రీ డబ్ల్యూ.బి. చంద్రశేఖర్‌పై రూ.25,000 జరిమానా విధించారు.

RTI దరఖాస్తును నిర్లక్ష్యం చేసిన అధికారి

విశాఖపట్నానికి చెందిన ఫిర్యాదుదారు శ్రీ పి. శ్రీనివాస్ బాబు సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని చట్టబద్ధమైన 30 రోజుల గడువులో అందించడంలో అధికారులు విఫలమయ్యారు. అప్పీలు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో విషయం సమాచార కమిషన్ ముందుకు వచ్చింది.

కమిషన్ ఆదేశాలను కూడా లెక్కచేయలేదు

విచారణలో భాగంగా కమిషన్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత అధికారి వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం, ఆలస్యానికి సరైన వివరణ ఇవ్వకపోవడం తీవ్రంగా పరిగణించబడింది.

సమాచారం చివరకు ఆలస్యంగా అందించినప్పటికీ, అది చట్ట ఉల్లంఘనను సమర్థించదని కమిషన్ స్పష్టం చేసింది.

“ప్రజల సమాచార హక్కును కాలరాయడం సహించము”

సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన హక్కు అని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించింది.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం, కమిషన్ ఆదేశాల పట్ల నిర్లక్ష్య వైఖరి, చట్టబద్ధ బాధ్యతలను విస్మరించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించి జరిమానా విధించినట్లు పేర్కొంది.

వేతనం నుంచి జరిమానా కోతకు ఆదేశం.

ప్రస్తుతం ప్రభుత్వ నియామకంతో కొనసాగుతున్న డైరెక్టర్ శ్రీ డబ్ల్యూ.బి. చంద్రశేఖర్ వేతనం/పారితోషికం నుంచి రూ.25,000 జరిమానా మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని పరిశ్రమలు & వాణిజ్య (గనులు) శాఖ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.

నాలుగు వారాల్లోగా అమలు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

“సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయి

Chavali Suneel
రాష్ట్ర సమాచార కమిషనర్, ఆంధ్రప్రదేశ్…