ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్

ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు

ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం

క్యాన్సర్‌ కణాలను గుర్తించి నయం

ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్

భారతదేశంలో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ముందడుగు పడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల కోసం కేవలం ఏడు నిమిషాల్లో పనిచేసే సరికొత్త ఇంజెక్షన్‌ అందుబాటులోకి వచ్చింది. రోచ్ ఫార్మా ఇండియా సంస్థ ‘టెసెంట్రిక్’ పేరుతో ఈ ఇమ్యునోథెరపీ మందును మార్కెట్‌లోకి విడుదల చేసింది.

కీమోథెరపీలా కాకుండా ఇమ్యునోథెరపీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేస్తుంది. ఈ ఇంజెక్షన్‌లోని ‘అటెజోలిజుమాబ్’ అనే మందు క్యాన్సర్ కణాల్లో ఉండే పీడీ-ఎల్1 ప్రొటీన్‌ను అడ్డుకుంటుంది. ఇది బ్లాక్ అవడం వల్ల శరీరంలోని రోగనిరోధక కణాలు క్యాన్సర్ సెల్స్‌ను సులభంగా గుర్తించి నాశనం చేస్తాయి.

ఈ మందుల తయారీలో వాడే అధునాతన సాంకేతికత, లోతైన పరిశోధనల వల్లే ధరలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రోచ్ సంస్థ ‘బ్లూ ట్రీ’ అనే సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించింది.