డాబా లలో ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ….

భారత్ న్యూస్ వరంగల్ …డాబా లలో ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ….

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం నేరేడిగొండలోని పలు డాబాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డాబాలలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవించడం, విక్రయించడం, గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోడ్డుపై పార్కింగ్ జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు…