భారత్ న్యూస్ రాజమండ్రి…ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల
ఇంటర్మీడియట్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. bie.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్ టికెట్ నంబరు, పుట్టినతేదీ నమోదు చేయడం ద్వారా వివరాలు పొందవచ్చని పేర్కొంది. ఏవైనా వ్యత్యాసాలు, సాంకేతిక సమస్యలున్నా హెల్ డెస్క్(ఫోన్ నంబరు 9392911819) సంప్రదించాలని సూచించారు.
