అహ్మదాబాద్ స్టేడియంలోనేడు రసవత్తుర పోటీ!

భారత్ న్యూస్ వరంగల్ …హైదరాబాద్:మే 12
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరు కుంది, టాప్ 4 లో నిలిచి ఫ్లే ఆఫ్ బెర్త్ ను, దక్కించుకోవడమే లక్ష్యంగా ఈరోజు ఇరుజట్లు హోరాహోరీ గా తలపడుతున్నా యి, ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోలేదు, కానీ రెండు జట్లు మాత్రం ఐపీఎల్ నుంచి నిష్క్రమించాయి…

ఈ నేపథ్యంలో ఈరోజు అహ్మదాబాద్‌ లో జరగనున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, మ్యాచ్ టాప్-4 సమీకరణాలను పూర్తి గా మార్చే అవకాశ ముంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎస్ ఆర్ హెచ్, గుజరాత్, జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటం తో నెట్ రన్‌రేట్ కూడా కీలకంగా మారింది.

సన్‌ రైజర్స్ హైదరాబా ద్ సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. క్రితం మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌పై 33 పరుగుల భారీ విజయంతో తమ బ్యాటింగ్ బలాన్ని మరోసారి నిరూపిం చింది. ఆ మ్యాచ్‌లో ఎస్ ఆర్ హెచ్, 235/4 భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ప్లే ఆఫ్ పోటీ తీవ్రంగా ఉండటంతో ఇకపై ఒక్క ఓటమి కూడా చాలా కాస్ట్లీగా మారుతుంది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ సీజన్ ఆరం భంలో తడబడినా కాస్త లేట్ అయినా ఇప్పుడు అద్భుతంగా పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల ఘన విజయం సాధించి మూడో స్థానానికి చేరుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో GT జట్టు టోర్నీ కీలక దశలో బాగా పుంజుకుంది.

ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో ఎస్ ఆర్ హెచ్,ఒకటి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లతో కూడిన టాప్ ఆర్డర్ ప్రత్యర్థి బౌలర్లపై మొదటి నుంచే దాడి చేస్తోంది. ఈ సీజన్‌లో ఎస్ ఆర్ హెచ్, ఇప్పటికే ఎనిమిది సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌పై 249 పరుగులు చేయడం వారి బ్యాటింగ్ దూకుడు ఏంటో అర్థమవుతుంది.

కెప్టెన్ పాట్ కమిన్స్ గాయంతో బయటకు వెళ్లి తిరిగి జట్టులో చేరడం బౌలింగ్ విభాగానికి పెద్ద బలం ఇచ్చింది. శ్రీలంక పేసర్ ఈషాన్ మలింగ ఈ సీజన్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే 16 వికెట్లు తీసిన మలింగ కీలక సమయంలో వికెట్లు సాధిస్తూ.. ఎస్ ఆర్ హెచ్, బౌలింగ్ లో కీలకంగా మారాడు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్, దూకుడు కొన్నిసార్లు బలహీనతగా మారు తోంది. ప్రారంభంలో వికెట్లు కోల్పోతే మిడి ల్ ఆర్డర్ ఒత్తిడిలో పడుతోంది. ఫీల్డింగ్ లోపాలు కూడా కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు నష్టం కలిగిస్తున్నాయి.