భారత్ న్యూస్ తిరుపతి…శుక్రవారం గ్రహబలం పంచాంగం
శుక్రవారం గ్రహాధిపతి “శుక్రుడు”. శుక్రుని అధిష్టాన దైవం “శ్రీ మహాలక్ష్మి” మరియు “శ్రీ ఇంద్రాణి”.
శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం శుక్రాయ నమః ||
- ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః ||
- ఓం ఇంద్రాణియై నమః ||
శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహా లక్ష్మీ సమేత శ్రీ మహా విష్ణు ఆలయాలను దర్శించండి. శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించండి.
శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం, వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు, మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం మానుకోండి.
గ్రహ బలం కొరకు, శుక్రవారం గులాబీ, తెలుపు, ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. శుక్రవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, స్త్రీలకు మంచి ఫలితాలు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతుంది.
అమృత కాలం:
02:13 PM – 04:00 PM
దుర్ముహూర్తం:
08:29 AM – 09:21 AM, 12:49 PM – 01:41 PM
వర్జ్యం:
01:40 AM – 03:24 AM
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం,
తిథి:
షష్టి: May 07 10:14 AM to May 08 12:21 PM
సప్తమి: May 08 12:22 PM to May 09 02:03 PM
షష్ఠి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి. షష్ఠి నిర్మాణం, గృహా వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, ఆభరణాల తయారీ, కొత్త స్నేహాలు, అనుబంధాలు, మరియు శత్రువుల పై విజయం సాధించే కార్యక్రమాలకు అనుకూల తిథి. వివాహ ప్రయత్నాలకు అంత శ్రేయస్కరం కాదు.
షష్ఠి తిథి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు, మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నక్షత్రం:
ఉత్తరాషాఢ: May 07 06:45 PM to May 08 09:19 PM
శ్రావణ: May 08 09:19 PM to May 09 11:24 PM
ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి “సూర్యుడు”. అధిష్టాన దేవత “విశ్వదేవ”. ఇది స్థిరమైన ప్రకృతి స్వభావం గల నక్షత్రం.
ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం సూర్యాయ నమః ||
- ఓం విశ్వదేవేభ్యో నమః ||
ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నరోజు – బావులు త్రవ్వడం, పునాదులు వేయడం, చెట్లు నాటడం, పదవులు చేపట్టడం, భూములు కొనుగోలు చేయడం, పుణ్య కార్యాలు, దేవతా ప్రతిష్ఠాపన, ఆలయ నిర్మాణం, వివాహా ప్రయత్నాలు వంటి శాశ్వత ప్రభావం కోరుకునే అన్ని పనులకు అనుకూలం.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది.
చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం “స్థావర లింగ పూజ” గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

లోకాః సమస్తాః సుఖినో భవంతు ||
శుభం భూయాత్ ||