భారత్ న్యూస్ హైదరాబాద్…ఇళ్లల్లో పనిచేసే మహిళా అభ్యర్థి గెలుపు!
వెస్ట్ బెంగాల్ :-
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కలితా మారీ ఔస్ట్రామ్ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు.
నెలకు ₹2,500 సంపాదిస్తూ, నాలుగు ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసే ఆమె సామాన్యులు కూడా రాజకీయాల్లో రాణించగలరని నిరూపించి చూపారు.

అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.