సోమవారం గ్రహాధిపతి “చంద్రుడు”. చంద్రుని అధిష్టాన దైవం పార్వతి దేవి మరియు వరుణుడు.

భారత్ న్యూస్ తిరుపతి…సోమవారం గ్రహబలం పంచాంగం

సోమవారం గ్రహాధిపతి “చంద్రుడు”. చంద్రుని అధిష్టాన దైవం పార్వతి దేవి మరియు వరుణుడు.

చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం సోమాయ నమః ||
  2. ఓం శ్రీమాత్రే నమః ||
  3. ఓం వరుణాయ నమః ||

చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతి దేవి సమేత శివాలయాలను దర్శించండి. శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం, శివ స్తోత్రాలు, దేవి స్తోత్రాలు పఠించండి.

సోమవారం కొత్త ఆలోచనలు చేయడానికి, బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహా పనులకు అనుకూలం. జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం చేయకండి. కఠినంగా కాకుండా, మృదు స్వభావాన్ని కలిగి ఉండండి.

గ్రహ బలం కొరకు, సోమవారం తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. సోమవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది.

అమృత కాలం:
03:00 AM – 04:48 AM

దుర్ముహూర్తం:
12:49 PM – 01:41 PM, 03:24 PM – 04:16 PM

వర్జ్యం:
04:14 PM – 06:02 PM

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం,

తిథి:
తదియ: May 04 03:02 AM to May 05 05:24 AM
చతుర్థి: May 05 05:24 AM to May 06 07:51 AM

తదియ విజయాన్ని ప్రసాదించే జయ తిథి. తృతీయ ముఖ్యమైన వ్యాపారాలు, వివాహా పనులు, విద్యార్థులు పాఠాలు మొదలుపెట్టడానికి, కొత్త నిర్మాణం పనులు ప్రారంభించడానికి, మరియు అనేక రకాల నూతన పనులకు అనుకూలమైన తిథి.

తదియ రోజు పార్వతి దేవిని, బ్రహ్మ దేవుడిని, శివుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తుంది.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

నక్షత్రం:
అనురాధ: May 03 07:09 AM to May 04 09:57 AM
జ్యేష్ఠ: May 04 09:57 AM to May 05 12:54 PM.

అనూరాధ నక్షత్రానికి అధిపతి “శనైశ్చరుడు”. అధిష్టాన దేవత “మిత్ర”. ఇది మృదువైన సున్నిత స్వభావం గల నక్షత్రం.

అనూరాధ నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం శనైశ్చరాయ నమః ||
  2. ఓం మిత్రాయ నమః ||

అనూరాధ నక్షత్రం ఉన్నరోజు – ఇంద్రియ సుఖాలు, అలంకరణలు, లైంగిక కార్యకలాపాలు, లలిత కళలు, స్నేహం చేయడం, కొత్త దుస్తులు ధరించడం, వివాహ ప్రయత్నాలు, గానం, నృత్యం, ఊరేగింపులు, శుభ వేడుకలు, పూజలు, ఉత్సవాలు, ప్రయాణాలు వంటి వాటికి అనుకూలం.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది.

చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం “స్థావర లింగ పూజ” గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

లోకాః సమస్తాః సుఖినో భవంతు ||

శుభం భూయాత్ ||

🙏