భారత్ న్యూస్ రాజమండ్రి…పశువులను రాత్రి వేళల్లో రోడ్డుమీదకు వదలవద్దు
వేసవి కాలంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది
కోడూరు ఎస్సై చాణిక్య
రైతులు ఎవరు కూడా తమ యొక్క పశువులను రాత్రి వేళల్లో రహదారుల మీదకు వదిలి వేయవద్దని మీ యొక్క పశువులను జాగ్రత్తపరుచుకోవాలని కోడూరు ఎస్సై చాణిక్య కోడూరు మండల రైతులకు విజ్ఞప్తి చేశారు.
కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో గేదెలు రావడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కోడూరు అవనిగడ్డ రోడ్డు మీద రాత్రి వేళల్లో చాలాచోట్ల పశువులు కనపడుతున్నాయని దీనివల్ల వాహనదారులు దగ్గరకొచ్చే వరకు కూడా గేదెలను గమనించలేకపోవడం వల్ల ప్రమాదాలు గురి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని, వేసవికాలం పంట పొలాలు ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో రైతులుపశు గ్రాసం కోసం పొలంలోకి వదులుతున్నారని, అయితే రాత్రి అవగానే మీయొక్క గేదెలను తీసుకుని వెళ్లాలని రోడ్లమీదకు వదల వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనుకొని సంఘటన వల్ల గేదె లకు గాని, వాహదారులు గాని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని కాబట్టి విషయాన్ని రైతులందరూ కూడా గమనించవలసిందిగా ఎస్సై చాణిక్య కోడూరు మండల పశు పోషకులకు తెలిపారు.