ట్రాఫిక్‌ పోలీసులకు కూల్ మిస్ట్ ఫ్యాన్

భారత్ న్యూస్ హైదరాబాద్….ట్రాఫిక్‌ పోలీసులకు కూల్ మిస్ట్ ఫ్యాన్

ఎండల తీవ్రత నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘మిస్ట్ ఫ్యాన్’ను అందుబాటులోకి తెస్తున్నారు. అసెంబ్లీ కూడలి వద్ద దీని డెమోను జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి ఈ ఫ్యాన్ల ద్వారా చల్లని గాలి, నీటి తుంపరలు లభించనున్నాయి. త్వరలోనే వీటిని నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.