ఓలా సంస్థకు జరిమానా

భారత్ న్యూస్ వరంగల్…..ఓలా సంస్థకు జరిమానా

వాహనంలో లోపాలు ఉన్నాయంటూ దాఖలైన కేసులో జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్

2023 నవంబర్ 9వ తేదీన ఓలా వాహనం కొనుగోలు చేసి, తరచూ సమస్యలు రావడంతో సర్వీస్ సెంటర్లో కూడా పరిష్కారం అవ్వకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి

ఫిర్యాదుదారుడి తరపు వాదనలు విని వాహనం ధర రూ.1,19,999, ఇన్సూరెన్స్ రూ.7,243, కేసు ఖర్చులు కింద రూ.5,000, మరో రూ.5,000 పరిహారం కింద బాధితుడికి చెల్లించాలని ఓలా సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్‌