భారత్ న్యూస్ రాజమండ్రి…రహదారుల మంజూరు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం గారు సానుకూల స్పందన
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు
అవనిగడ్డ:
నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి, త్రాగునీటి సమస్యల పరిష్కారంపై డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు తెలిపారు. మంగళవారం విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఆయన ఈ మేరకు పలు ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లా పరిషత్ రహదారుల అభివృద్ధికి రూ.9.87కోట్లు నిధులు మంజూరు చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కు ప్రతిపాదనలు అందచేశారు. తమ నియోజకవర్గంలో మొత్తం 546.89కిలోమీటర్లు పొడవైన 251 జిల్లా పరిషత్ రహదారులు చాలావరకు పాడై ఉన్నట్లు తెలిపారు. వీటిలో అత్యవసరంగా మరమ్మత్తులు చేయాల్సిన కొన్ని రహదారుల అభివృద్ధికి నిధులు కోరుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 14.100 కిలోమీటర్ల మేరకు ఏడు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.9.87కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు నిధుల మంజూరుకు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు తెలిపారు.
