భారత్ న్యూస్ రాజమండ్రి…ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అంతర్జాతీయంగా LPG గ్యాస్ సరఫరా సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ
త్వరలో మరో 44,346 స్టవ్‌లు పంపిణీ
రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు అందుబాటులోకి
ఈ కార్యక్రమాన్ని Energy Efficiency Services Limited (EESL) సహకారంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.

అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం తయారీలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.