PMAY గ్రామీణ్ 2.0 పథకం – ఇళ్ల యూనిట్ ధర ఖరారు

భారత్ న్యూస్ గుంటూరు…PMAY గ్రామీణ్ 2.0 పథకం – ఇళ్ల యూనిట్ ధర ఖరారు

గ్రామీణ పేదలకు గుడ్ న్యూస్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్రభుత్వం యూనిట్ ధరను ఖరారు చేసింది.

🏠 ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹2.39 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు.
🤝 ఈ మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అందించనున్నాయి.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమ సొంత పక్కా ఇల్లు నిర్మించుకునే అవకాశం పొందనున్నారు.