భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…డ్రగ్స్ కేసులో రోహిత్‌రెడ్డికి రిమాండ్
TG: మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో న్యాయస్థానం ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించింది. పార్టీలో పాల్గొన్న 11 మందిలో 8 మందికి నోటీసులిచ్చి వదిలేసిన పోలీసులు.. రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, పోలీసులపై కాల్పులు జరిపిన నమిత్ శర్మలను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించటంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
