అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

భారత్ న్యూస్ అనంతపురం..అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Mar 15, 2026,

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంతోపాటు పుదుచ్చేరికి ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్, అస్సాం, పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. అస్సాంలో రేపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 4న తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.