దద్దరిల్లిన పశ్చిమాసియా..ఇరాన్, లెబనాన్లపై భారీగా వైమానిక దాడులు

భారత్ న్యూస్ తిరుపతి…దద్దరిల్లిన పశ్చిమాసియా..ఇరాన్, లెబనాన్లపై భారీగా వైమానిక దాడులు

భారీగా విరుచుకుపడిన అమెరికా-ఇజ్రాయెల్

1,700కు చేరుకున్న మృతులు…టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు, గోడలు

గల్ఫ్ పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్

యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్

వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ

ట్రంప్ తొలి ప్రకటనతోశాంతించిన ‘చమురు’ స్టాక్ మార్కెట్లకూ ఉపశమనం

దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది.ఇరాన్, లెబనాన్లపై అమెరికా-ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడగా.. ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1,700 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించడం.. ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హర్మూజ్ జల సంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్లీ వెల్లడించడం.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేయడం.. మంగళవారం గందరగోళాన్ని సృష్టించింది. యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర 90 డాలర్లకు తగ్గింది.ప్రపంచ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి.

టెహ్రాన్లో బాంబుల మోత

ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మంగళవారం మధ్యాహ్నం పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పలు భవనాలు, గోడలు కదిలిపోయాయి. శిథిలాల నుంచి పలువురిని వెలికితీయాల్సి వచ్చింది. టెహ్రాన్, ఇతర నగరాల్లో దాడులతో బెంబేలెత్తుతున్న వేల మంది ప్రజలు.. చిన్న పట్టణాలు, గ్రామాలకు తరలివెళ్తున్నారు. దాదాపు లక్ష మంది టెహ్రాన్ను వీడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు.

పశ్చిమ ఇరాన్లోని అరాక్ నగరంపై జరిగిన దాడిలో ఐదుగురు పౌరులు మరణించారు.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 1,255 మంది మరణించారని, 10,000 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు.

లెబనాన్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని హెజొబొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. టైర్ నగరంపై రెండు వైమానిక దాడులు జరిగాయి. ఇంకా అల్మజాదిల్, ఛఖ్రా, శ్రిఫా, బెక్కా వాలీలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో 5,00,000 మంది నిరాశ్రయులయ్యారు.

అనసరియా, బింట్ జిబీల్ అయినాతా ప్రాంతాలపై జరిగిన దాడుల్లో నలుగురు మృతి చెందారు. దక్షిణ లెబనాన్లోని ఖాయా నగరంలో యుద్ధ ట్యాంకుతో జరిపిన దాడిలో క్యాథలిక్ మత గురువు అల్-రహీ మరణించారు.

లెబనాన్లో ఇప్పటిదాకా 486 మంది మరణించారు.

లెబనాన్లోని ఖియాంలో ఇజ్రాయెల్ సైనికులపై మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ ఘటనలో 3 మెర్కావా ట్యాంకులు, 3 వాహనాలు దగ్ధమయ్యాయి.

ఇరాక్లోని కిర్కుక్లో ఇరాన్కు మద్దతిచ్చే మిలిటెంట్ గ్రూపుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు మిలీషియా సభ్యులు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు.

సైరన్ల మోత

ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్లోని అరబ్ దేశాలపై మంగళవారం ఇరాన్ దాడులతో విరుచుకుపడింది. పలు నగరాల్లో సైరన్ల మోత మోగింది.

ఇజ్రాయెల్లోని జెరూసలెంలో సైరన్లు మోగాయి. టెల్ అవీవ్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రక్షణ వ్యవస్థలు క్షిపణులను అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్పైకి హెజ్బొల్లా క్షిపణులను ప్రయోగించింది. మధ్య ఇజ్రాయెల్లో హెజొబొల్లా జరిపిన దాడిలో 16 మంది గాయపడ్డారు.

ఇజ్రాయెల్లోని సఫద్లో ఉన్న గివా డ్రోన్ కంట్రోల్ సెంటర్పై క్షిపణులను, యిఫ్తా బ్యారక్పై రాకెట్లను ప్రయోగించామని హెజ్బొల్లా ప్రకటించింది.

దుబాయ్ లోని నూతన వ్యాపార హబ్పైకి క్షిపణులు దూసుకొచ్చాయి. పెట్రో కెమికల్ ప్లాంట్లున్న రువాయిస్లో డ్రోన్ దాడితో మంటలు అంటుకున్నాయి.

దద్దరిల్లిన పశ్చిమాసియా

ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న యూఏఈ కాన్సులేట్పై జరిగిన దాడిలో సామగ్రి ధ్వంసమైంది.

బహ్రెయిన్ రాజధాని మనామాలోని నివాస భవనంపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో 29 ఏళ్ల మహిళ మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు.

సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలున్న తూర్పు ప్రాంతంపైకి దూసుకొచ్చిన రెండు డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.

ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 6 డ్రోన్లను కువైట్ నేషనల్ గార్డ్ కూల్చివేసింది.

దాడులు కొనసాగుతాయి..-నెతన్యాహు

ఇరాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. నిరంకుశ పాలన నుంచి ఇరాన్ ప్రజలను విముక్తులను చేయడమే తమ లక్ష్యమని, అయితే అది వారిపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఇరాన్ ఎముకలను విరగ్గొట్టామని తెలిపారు.

కాల్పుల విరమణకు ఎదురుచూడటం లేదు