భారత్ న్యూస్ అనంతపురం..తొలి మహిళా టీటీఈగా సరిత యోల్మో
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (DHR) చరిత్రలో మరో అరుదైన మైలురాయి నమోదైంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ రైల్వేలో తొలి మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)గా సరిత యోల్మో నియమితులయ్యారు.ఈశాన్య సరిహద్దు రైల్వేలో పనిచేస్తున్న ఆమె, ప్రస్తుతం ఈ చారిత్రక హెరిటేజ్ లైన్లో టూర్ డ్యూటీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు నిదర్శనమని అధికారులు ప్రశంసిస్తున్నారు.
