మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది ఫిబ్రవరి 15న (ఆదివారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…మహాశివరాత్రి ఎప్పుడు?

మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది ఫిబ్రవరి 15న (ఆదివారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మాఘ బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5:05 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు 16వ తేదీ సాయంత్రం 5:34 గంటలకు ముగుస్తుంది. శివరాత్రి పూజకు ప్రధానమైన ‘నిశిత కాలం’ 15వ తేదీ అర్ధరాత్రి ఉండటంతో గంగాజలంతో లేదా
పంచామృతాల(పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) తో లింగానికి అభిషేకం చేస్తే
శుభప్రదమని అంటున్నారు.