భారత్ న్యూస్ గుంటూరు…ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో ఇంగ్లీష్ పరీక్ష తేదీ మారింది.
రంజాన్ పండుగ మార్చి 20వ తేదీన ఉన్నందున, ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21వ తేదీకి (శనివారం) మారుస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
మిగిలిన పరీక్షల వివరాలు :
మార్చి 16: ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21: ఇంగ్లీష్ (మారిన తేదీ)
మార్చి 23: గణితం
మార్చి 25: ఫిజికల్ సైన్స్
మార్చి 28: బయోలాజికల్ సైన్స్
మార్చి 30: సోషల్ స్టడీస్
మార్చి 31: ఓఎస్ఎస్‌సీ పేపర్-1
ఏప్రిల్ 01: ఓఎస్ఎస్‌సీ పేపర్-2 / వృత్తి విద్యా కోర్సులు

పరీక్షలు అన్నీ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇంగ్లీష్ పరీక్ష మినహా మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.