భారత్ న్యూస్ రాజమండ్రిAmmiraju Udaya Shankar.sharma News Editor…….లీజు గడువు ముగిసిన మైన్స్‌లో అక్రమ మైనింగ్
ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పెడతానన్నాడు. ఎప్పుడు పెడతాడు. ఎక్కడ పెడతాడో చెప్పడం లేదు. ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్‌పోర్టు చేస్తున్నాడు. చైనాలో ఫ్యాక్టరీ పెడతాడా? పది వేల టన్నులు ఎక్సపోర్ట్ చేస్తే రూ. 5 కోట్లు వస్తుంది. దానికోసం వేల మంది కార్మికులను, ఎక్స్‌పోర్టర్లను, మైనింగ్ వ్యాపారులను రోడ్ల పాలు చేస్తున్నాడా? అని ఆరాతీస్తే దీనివెనుక భారీ కుట్ర దాగి ఉందని తెలిసింది. సిద్ధివినాయక, కేఎస్సార్, శోభారాణి వంటి 50 ఏళ్లు పర్మిషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టాభూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు. ఇలా ఏడాదికి రూ. 250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ. వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సిన ఈ మైన్స్ లో ఎంపీ ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నాడు. రూ. 5 కోట్లు మెషినరీ కొనుగోలు చేసి రూ. వెయ్యి కోట్లు దోచుకోవాలని భారీ స్కెచ్ వేశాడు. నేను చెప్పేవన్నీ అబద్ధాలే అయితే, ఈ మైన్స్‌తో తనకు సంబంధం లేదని, తాను నిజాయితీపరుడే అయ్యుంటే వారం రోజుల్లో సర్వే చేయించి ఈ లీజు ముగిసిన క్వారీల్లో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టి స్వాధీనం చేసుకోవాలి. లీజు గడువు ముగిసిన భూముల్లో అక్రమ మైనింగ్ జరిగితే భవిష్యత్తులో పర్మిషన్ ఇవ్వకూడదని తెలిసి కూడా ఇష్టారాజ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. కాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం.

-మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు