భారత్ న్యూస్ అనంతపురం..ఏపీలో ఆర్టీసీ డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ
తాను కోరిన చోట బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ బస్సును వెంబడించి మరీ డ్రైవర్‌పై దాడి
అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెనపై ఆపిన మహిళ
బస్సు ఆపకుండా ముందుకు వెళ్లిపోయిన డ్రైవర్
బస్సును వెంబడిస్తూ, మోపిదేవి ప్రధాన సెంటర్లో బస్సును అడ్డుకున్న మహిళ
బస్సు డ్రైవర్ చెంపపై చెప్పుతో కొట్టిన మహిళ
అంతటితో ఆగకుండా తన బంధువులకు ఫోన్ చేసి చల్లపల్లి బస్ స్టాప్ కు పిలిపించిన మహిళ
డ్రైవర్ పై మరోమారు దాడి చేసిన మహిళ బంధువులు

గొడవను పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా సర్దుబాటు చేసిన మహిళకు సమీప బంధువైన ఓ కానిస్టేబుల్