కూటమి ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బండారు ఫైర్

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖపట్నం :

కూటమి ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బండారు ఫైర్

ఏపీలో కూటమి సర్కార్ ఫై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేగా ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నానంటూ బండారు మినీ మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు.“నిధులు కేటాయింపులో వివక్ష చూపారన్నారు.

మా నియోజకవర్గానికి మూడు కోట్లు మాత్రమే ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల్లో తిరగలేక పోతున్నా, వారికి సమాధానం చెప్పలేకపోతున్నా, ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా” అంటూ కూటమి ప్రభుత్వం పై బండారు ఫైర్ అయ్యారు.