…భారత్ న్యూస్ హైదరాబాద్…:మే 11
పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 పాలీసెట్ పరీక్షలను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలోని 3 సంవత్సరాల ఇంజనీ రింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా..
వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై ఈనెల మే 13వ తేదీ మంగళవారం రోజున ఉ. 11.00 గం. నుండి మ. 1.30 వరకు రాష్ట్ర వ్యాప్తం గా నిర్వహించుటకై నిబంధ నల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
పాలీసెట్-2025 కు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,716 మంది అభ్యర్థులు 276 పరీక్ష కేంద్రాలలో హాజర వుతున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి ఒక గంట ముందుగానే అనుమతిస్తారు.
కాబట్టి విద్యార్ధులు ఉ.10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని OMR షీట్ లోని రెండు వైపుల వివరాలను పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుంది. విద్యార్థులు తమ వెంట బ్లాక్ పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పక తీసుకొని రావాలని సూచించారు
పరీక్ష ప్రారంభం అయిన ఉ 11.00 గం.తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన అభ్యర్థిని పరీక్ష కేంద్రం లోనికి అనుమతించబ డరు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో, ID ప్రూఫ్ (ఆధార్ కార్డు) తెచ్చుకోవలెను.
అలాగే పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్ కానీ, ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అనుమతించబడవు. ఇక ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం 60 మార్కులు, భౌతిక శాస్త్రం 30 మార్కులు, రసాయన శాస్త్రం 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది.
వ్యవసాయం, ఉద్యానవన, వేటరినరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా జీవశాస్త్రంలో మరో 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది..