భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో పంచాయతీ ఎన్నికలు..2.89కోట్ల మంది ఓటర్లు!
అమరావతి :
త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదలైంది.
మొత్తం 2,89,01,402 మంది ఓటర్లలో పురుషులు 1,42,26,677, మహిళలు 1,46,73,412, ట్రాన్స్ జెండర్లు 1,313 మంది ఉన్నారు .
మొత్తం 13,348 పంచాయతీలకు గానూ 13,259 పంచాయతీల ఓటర్ల జాబితాను పంచాయితీ రాజ్ శాఖ ప్రకటించింది.

17 జిల్లాల్లో ఓటర్ల జాబితా పూర్తవగా కోర్టు కేసులు, తదితర కారణాలతో 11 జిల్లాల్లోని 89 పంచాయతీ జాబితాలు పూర్తి కాలేదని తెలిపింది.