.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్:మే 27
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి. ఎగ్జిబిషన్ సొసైటీ, రాష్ట్ర ప్రభుత్వం, బత్తిని హరినాథ్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో జూన్ 8, 9 తేదీల్లో చేప మందును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చేపమందు పంపిణీ ఏర్పాట్లపై సోమవారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసారి 32 కౌంటర్లలో చేపమందు పంపిణీ ఉంటుందని, జూన్ 8న ఉదయం 8.30లకు ప్రారంభమయ్యే చేపమందు పంపిణీ మరుసటి రోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
