ఆర్మూర్‌, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధార్ -ఈ సంతకం త్వ‌ర‌లోనే అమ‌లు అవుతుంది.

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్మూర్‌, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధార్ -ఈ సంతకం త్వ‌ర‌లోనే అమ‌లు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2 నుండి స్లాట్ బుకింగ్ విధానంతో పాటు ఈ సంతకం కూడా అమ‌లులోకి వస్తుంది అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆధార్-ఈ సంతకం ద్వారా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.

సోమవారం సచివాలయంలో ఆయన, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్‌తో కలిసి స్లాట్ బుకింగ్ విధానం, అధిక భారంతో ఉన్న కార్యాలయాలకు అదనపు రిజిస్ట్రార్‌ల నియామకాలు, పోస్టింగ్‌లను సమీక్షించారు. సాంకేతిక స‌మ‌స్యలు లేకుండా అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, ఆధార్-ఈ సంతకం విజయవంతంగా సాగాల‌ని సూచించారు.

పఠాన్‌చెరువు, యాదగిరిగుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ కార్యాలయాలకు అదనపు ఎస్ ఆర్ వోల్స్ నియమించారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలందించేలా సబ్ రిజిస్ట్రార్‌ల పనితీరు ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు.